
4.8K
KEవిజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఎ.వెంకటేశ్వరరావు గారు మరియు డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది...
ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన ఎక్విప్మెంట్ కు డాక్టర్లు ప్రతిపాదన చేశారు... డాక్టర్లకు కావలసిన అత్యాధునిక పరికరాలను కచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలపడం జరిగింది... రోజుకి వేలాది మంది ఓపి పేషెంట్స్ వచ్చే హాస్పిటల్ ఇది.. ఏపీలో ఈ స్థాయిలో ఓపి వచ్చే హాస్పిటల్ లేదు... హాస్పటల్ లో వసతులు పెంచాలి, ఏ విధంగా వసతులు పెంచాలని దానిపై చర్చించడం జరిగింది... ప్రతి నెల జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి హాస్పటల్ అభివృద్ధికి చర్చించుకుంటాము... రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని వసతులను సమకూరుస్తాము... ఇక్కడ సిబ్బంది కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది... నర్సింగ్ విద్యార్థుల సమస్యలు గురించి చర్చించాము, కొత్త భవనం పూర్తి అవ్వగానే నర్సింగ్ విద్యార్థులను కొత్త భవనంలోకి తరలిస్తాము...
సమావేశం అనంతరం ఈరోజు ఉదయం బైక్ యాక్సిడెంట్ కి గురైన ఏబీఎన్ ఛానల్ కెమెరామెన్ ఉమామహేశ్వరరావు దంపతులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకోని, మెరుగైన వైద్యం అందించవలసిందిగా వైద్యులకు సూచించడం జరిగింది...
జనరల్ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది....
#GovernmentHospital #VijayawadaGovernmentHospital #GGH #vijayawada #VijayawadaParliament
@kesinenisivanath










